టీడీపీలో చేరాలంటే కండీషన్స్ అప్లై
NEWS Jun 07,2025 03:07 pm
తెలుగుదేశం పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఇకపై పార్టీలో చేరాలంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి చేసింది. పార్టీలో చేరికలపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని, ఎంక్వైరీ చేసి అనుమతి ఇచ్చిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని స్పష్టం చేశారు పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు.