రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ
NEWS Jun 07,2025 10:16 am
తెలంగాణ కేబినెట్ ను విస్తరించనున్నారు. ఇందులో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చేందుకు హైకమాండ్ ఒప్పుకుంది. రాజ్ భవన్ నుంచి ఏ క్షణమైనా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఆయా సామాజిక వర్గాల వారీగా పదవులు కట్టబెట్టనున్నారు సీఎం. విజయ శాంతి, అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకట స్వామితో పాటు పలువురు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరికి చోటు దక్కుతుందనేది సస్పెన్స్ కొనసాగుతోంది.