న్యూయార్క్, టోక్యోతో తెలంగాణ పోటీ - సీఎం
NEWS Jun 06,2025 08:41 pm
తెలంగాణ పోటీ దేశంలోని రాష్ట్రాలతో కాదని న్యూయార్క్, టోక్యో నగరాలతోనే పోటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు ఆశీర్వదిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు. ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా మారుస్తామన్నారు. దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి కాదు న్యూయార్క్, టోక్యోలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ది చేస్తానని చెప్పారు. ఆలేరు సభలో సీఎం ప్రసంగించారు.