‘మై లవ్’ ఆల్బమ్ విడుదల
NEWS Jun 06,2025 08:31 pm
హైదరాబాద్: ప్రసాద్ ల్యాబ్‌లో ‘మై లవ్’ ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిషోర్ తేజ - సాత్విక జంపా జంటగా నటించిన ఈ ఆల్బమ్‌ను వాకాడ అప్ప రావు నిర్మించగా, రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వం వహించారు. సంగీతం క్రాంతి ఆచార్య, జయపాల్ రెడ్డి నిమ్మల, సాహిత్యం సురేష్ బనిసెట్టి, గాయకులు మహమ్మద్ హైమత్, కరీకపిలన్ ఆలపించారు.