మాగంటి గోపినాథ్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది
NEWS Jun 06,2025 03:16 pm
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రభుత్వం తరఫున మాగంటికి అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. గోపీనాథ్ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడని స్పష్టం చేశారు.