పెద్దల సభకు కమల్ హాసన్ నామినేషన్
NEWS Jun 06,2025 03:03 pm
మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్, స్టార్ హీరో ఇలయ నాయగన్ కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. మొత్తం నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ కావడంతో వీటిలో ఒక స్థానానికి సిఫారసు చేశారు సీఎం. ఎన్నికల పొత్తులో భాగంగా తనకు సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి ఉదయనిధి.