హరి హర వీరమల్లు చిత్ర నిర్మాత ఎంఎం రత్నం కీలక ప్రకటన చేశారు. తాను నిర్మించిన పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 12న విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల రిలీజ్ చేయడం లేదని తెలిపారు. ట్రైలర్ తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్.