ఏడు మంది ఐపీఎస్ ల బదిలీలు
NEWS Jun 05,2025 07:10 am
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్తాను నియమించంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, తెలంగాణా FSL డైరెక్టర్ గా షికా గోయల్ ను బదిలీ చేసింది. CID చీఫ్ గా చారు సిన్హా నియామకంతో పాటు అడిషనల్ డీజీ హోదాలో ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా అదనపు బాధ్యతలు కల్పించింది. జోన్ 6 చార్మినార్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్ ను బదిలీ చేసింది. మెదక్ ఎస్పీగా శ్రీనివాస్ రావు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా కంటిలాల్ సుభాష్ ,హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్య కుమార్ లపై బదిలీ వేటు వేసింది.