రూ. 11 కోట్ల రెమ్యునరేషన్ పవన్ వాపస్
NEWS Jun 04,2025 05:13 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హరి హర వీరమల్లు మూవీలో నటించినందుకు గాను తనకు పారితోషకం కింద ఇచ్చిన రూ. 11 కోట్లను వాపసు ఇస్తున్నట్లు ప్రకటించారు పవర్ స్టార్. జూన్ 12న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సెన్సార్ పూర్తి కాక పోవడంతో, సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో విడుదల కానుందని సమాచారం. కాగా థియేటరికల్ బిజినెస్ పూర్తి కాక పోవడంతో నిర్మాత ఎంఎం రత్నం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.