కోలుకుంటున్న బొత్స సత్యనారాయణ
NEWS Jun 04,2025 12:26 pm
బొత్స సత్యనారయణ కోలుకొంటున్నారని తెలిపారు సోదరుడు అప్పల నర్సయ్య. రెండేళ్ల క్రితం బొత్సకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. ఈరోజు వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ లో పాల్గొన్నారని, అలసి పోవడం వల్ల కుప్పకూలారని చెప్పారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.