భట్టికి నాగార్జున ఆహ్వానం
NEWS Jun 04,2025 11:52 am
తన కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తన నివాసంలో కలిసి ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వయంగా అందించారు. పెద్ద కొడుకు నాగ చైతన్య సమంత విడి పోయాక మరో నటి శోభితను వివాహం చేసుకున్నారు. రెండో కొడుకు అఖిల్ ముంబై భామతో గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నాడు. చివరకు పెళ్లికి అంగీకరించడంతో ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి పత్రికలను సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు స్వయంగా ఇచ్చారు నాగార్జున. తన ఎన్ కన్వెన్షన్ హాల్ ను పడగొట్టించాడు సీఎం. ఆ తర్వాత కోర్టుకు వెళ్లాడు నటుడు.