తెలంగాణ ప్రజలకు పవన్ శుభాకాంక్షలు
NEWS Jun 02,2025 11:29 am
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ అని కొనియాడారు. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 వ ఏట అడుగు పెడుతున్న శుభ సమయాన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.