మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎవరిని ఉద్దరించడానికి అందాల పోటీలు నిర్వహించారంటూ మండిపడ్డారు. ఇంగ్లండ్ కు చెందిన కంటెస్టెంట్ పై అనుచితంగా ప్రవర్తించి రాష్ట్ర గౌరవానికి మచ్చ తెచ్చారని అన్నారు. పైసలు లేవని చెప్పే సీఎం.. రూ.200 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహించారంటూ ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.