కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పాలమూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహావిష్కరణపై రాద్దాంతం చోటు చేసుకుంది. పాత డీఈఓ ఆఫీస్ చౌరస్తాలో మున్సిపాలిటీ అనుమతితో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్దమయ్యారు ఫ్యాన్స్. కృష్ణ విగ్రహంతో పాలమూరు జిల్లాకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు ప్రజా సంఘాల నేతలు. ఏం ఉద్దరించాడని తనను ఇక్కడ ఏర్పాటు చేశారంటూ ఫైర్ అయ్యారు.