మాదాపూర్‌లో యువకుడు దారుణ హత్య
NEWS May 31,2025 01:23 pm
మాదాపూర్ లో జయంత్ గౌడ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యశోద ఆస్పత్రి వెనుక తన తల్లి బర్త్ డే సందర్భంగా స్నేహితులకి పార్టీ ఇచ్చాడు. స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీ చేసుకుంటుండగా బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు ముగ్గురు దుండగులు. గొడవకు దిగిన జయంత్ గౌడ్ పై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.