కల్వకుంట్ల ఫ్యామిలీదంతా ఓ డ్రామా
NEWS May 31,2025 12:48 pm
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. కల్వకుంట్ల ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ డ్రామా అంతా జరుగుతోందన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య నాలుగు ముక్కలాట నడుస్తోందన్నారు. కవిత వ్యవహారంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం ఉందా అని ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో బీఆర్ఎస్ ని కలపాలని ప్రయత్నం చేశారని సంచలన కామెంట్స్ చేశారు. కానీ తాము ఆపార్టీని దగ్గరకు రానివ్వడం లేదన్నారు.