తిరుమలలో విస్తృతంగా తనిఖీలు
NEWS May 29,2025 07:40 am
తిరుమలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కళ్యాణ కట్ట షెడ్, లేపాక్షి, ఎస్. వి.ఎస్.షాపింగ్ మాల్, ఆస్టాన మండపం, షాపింగ్ మాల్ పిఎస్ 4, ముల్లగుంట పార్కింగ్ వంటి ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. బాంబు స్వ్కాడ్ , డాగ్ స్వ్కాడ్ తో భక్తుల బ్యాగ్ లను తనిఖీలు చేశారు. ఎక్కడ నుండి వచ్చారు, ఎప్పుడూ శ్రీవారిని దర్శనం చేసుకున్నారని వివరాలు సేకరించారు. శ్రీవారి దర్శనం అయిన వారు ఇక్కడ ఉండ కూడదని అక్కడ నుండి పంపి వేశారు.