తెలుగుదేశంకు కార్యకర్తలే బలగం
NEWS May 29,2025 07:32 am
అవమానించిన చోటే సైకిల్ పై జైత్రయాత్ర చేసిన మీలాంటి పసుపు సైనికులే మాకు స్పూర్తి, ప్రతిపక్షంలో ఉండగా అధినేతకు అండగా మీలాంటి వారు అందించిన సంఘీభావంవల్లే గత ఎన్నికల్లో విజయఢంకా మోగించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. గత ప్రభుత్వంలో బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా 2023 అక్టోబర్ 2న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారని గుర్తు చేశారు.