ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు
NEWS May 28,2025 06:55 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. థియేటర్లలో తీసుకున్న సేఫ్టీ మేజర్స్, సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాలు సేకరించారు. కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో థియేటర్ల వద్ద తనిఖీలు జరిగాయి. ఆర్డీవో, తహసీల్దార్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.