భారీ వర్షాలు జర భద్రం - సీఎం
NEWS May 28,2025 06:46 am
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నగర పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచనలు చేశారు. రోడ్లపై నీటి నిల్వ లేకుండా , ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలన్నారు.