పవన్ కామెంట్స్ కరెక్టేనన్న అల్లు అరవింద్
NEWS May 25,2025 06:43 pm
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసేస్తామనడం కరెక్ట్ కాదన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ సరైనవేనని అన్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సినీ పెద్దలు వెళ్ళి కలవాల్సి ఉండేదన్నారు. సర్కార్ సహకారం లేకుండా ఏమీ జరగదన్నారు. సినిమా వాళ్ల కోసం పవన్ కళ్యాణ్ పాటు పడుతున్నాడని చెప్పాడు. థియేటర్లు ఏకపక్షంగా మూసేయడానికి నలుగురు మద్దతు పలికారని, వారిలో తాను లేనని అన్నారు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ ఉందన్నారు.