విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడు పోయాడు అనడానికి ఇదిగో సాక్ష్యం..అంటూ వీడియో రిలీజ్ చేసింది వైసీపీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు చంద్రబాబు నమ్మిన బంటు టీడీ జనార్థన్ తో విజయ సాయిరెడ్డి రహస్య మంతనాలు జరిపారని పేర్కొంది. తన గురించి మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవమేనంటూ స్పష్టం చేసింది.