అందాల పోటీలపై ఇప్పుడు ఏమంటారు..?
NEWS May 25,2025 11:00 am
తెలంగాణ సర్కార్ ను ఏకి పారేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తాను అందాల పోటీల గురించి కామెంట్స్ చేస్తే ఆరోపణలు చేశారని ఇప్పుడు సీఎం రేవంత్, మంత్రులు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు. సాక్షాత్తు మిస్ ఇంగ్లండ్ మిల్లీ మాగీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. పోటీల నిర్వాహకులు తనను వేశ్య లాగా చూశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు అర్థమైందా అని తాను ఎందుకు మాట్లాడోనని చెప్పారు.