ఎమ్మెల్సీ కవిత లేఖ ఓ రాజకీయ డ్రామా
NEWS May 24,2025 11:11 am
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పై. వంద జాకీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ ఇక లేవదన్నారు. వరంగల్ సభ కోసం హరీష్ రావు అంత కష్టపడితే కనీసం ఒక్క ఫోటో కూడా పెట్టలేదన్నారు. కవిత అంత పెద్ద సీనియర్ నాయకురాలు ఏం కాదన్నారు.ఆ సభలో కేవలం రాజు, యువరాజు తలకాయలే కనిపించాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓపెన్ గా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందంటూ ఆరోపించారు. కల్వకుంట్ల కవిత లేఖ అంతా ఓ రాజకీయ డ్రామా అంటూ కొట్టి పారేశారు.