కేసీఆర్ దేవుడు చుట్టూ దెయ్యాలున్నాయి
NEWS May 24,2025 10:38 am
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది తన తండ్రి గురించి. కేసీఆర్ దేవుడు అని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వాళ్ల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు. అంతరంగికంగా కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం కావడం బట్టి పార్టీలో ఏం జరుగుతుందో ఆలోచించు కోవాలని హితవు పలికారు. ఆమె చేసిన కామెంట్స్ గులాబీ దళంలో కలకలం రేపాయి.