జగన్ కు విజయ సాయి రెడ్డి కౌంటర్
NEWS May 24,2025 10:23 am
మాజీ సీఎం జగన్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. తాను మారలేదని, నువ్వే మారి పోయావంటూ ఎద్దేవా చేశారు. తన వ్యక్తిత్వం అలాగే ఉంటుందన్నారు. ఎవరు ఎవరికి లొంగి పోయారో ప్రజలకు బాగా తెలుసన్నారు. తాను ఎవరి వల్ల మీ నుంచి దూరమయ్యానో మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఆరు నూరైనా సరే తాను ఎప్పటికీ మారబోనని, ఇలాగే ఉంటానని స్పష్టం చేశారు. నువ్వే పదవి వచ్చాక పూర్తిగా మారి పోయావంటూ సంచలన ఆరోపణలు చేశారు.