శ్రీలంక స్టార్ క్రికెటర్ మాథ్యూస్ రిటైర్మెంట్
NEWS May 24,2025 10:17 am
శ్రీలంక స్టార్ క్రికెటర్, బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన ప్రకటన చేశారు. తాను టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘమైన ఆట ఆడేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. వేలాది మంది అభిమానులను దక్కించుకునేలా చేసిన ఘనత క్రికెట్ కు దక్కుతుందన్నాడు. తను 17 ఏళ్ల పాటు ఆడానని, ఆట నుంచి తప్పుకునేందుకు సమయం ఆసన్నమైందని భావించానని, అందుకే వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. శ్రీలంక విజయాలలో కీలక పాత్ర పోషించాడు తను.