ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి కేసీఆర్‌కి రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అది తాను రాసిన లేఖేనని ప్రకటించారు కవిత, "కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి. పార్టీలో కోవర్టులు లేఖ బయటకు లీక్ చేశారు. నేను గతంలో చాలాసార్లు అలా లేఖ రాశాను. కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళుతుంది" అంటూ మీడియాతో అన్నారు కవిత.