ఎస్సై అనిల్ కు ఘన సన్మానం
NEWS May 23,2025 07:49 pm
డీజీపీ నుండి ఉత్తమ ఎస్ హెచ్ ఓగా ఎన్నికైన సందర్బంగా ఇబ్రహీంపట్నం పీఎస్ ఎస్ఐ అనిల్ ని మెట్ పల్లి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ ప్రాంతానికి గర్వ కారణంగా నిలిచారని పేర్కొన్నారు సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు. ఈ సందర్బంగా ఎస్ఐని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్మి రవి, క్యాషియర్ దొంతుల లక్ష్మి నారాయణ, కోట కిరణ్ కుమార్ , పడిగల శ్రీనివాస్ , చింత లవకుమార్ , సంతోష్ , చిటిమెళ్ళి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.