కలిగిరి శ్రీవారి ఆలయంలో జీర్ణోద్దరణ
NEWS May 23,2025 08:11 am
టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కలిగిరి కొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 28వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 గం.ల వరకు ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం, హారతి జరుగనుంది.