బేడి ఆంజనేయ స్వామికి ఘనంగా పూజలు
NEWS May 23,2025 08:08 am
తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో, మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద టీటీడీ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు మేళతాళాల నడుమ ప్రత్యేక పూజలు, అస్థానం వేడుకగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, అదనపు ఈఓ సి హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.