కవిత లేఖపై కేసీఆర్ ఆరా
NEWS May 23,2025 07:34 am
ఎమ్మెల్సీ కల్వకుంట్ల తన తండ్రికి రాసిన లేఖ పార్టీలో , రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. పలువురు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ చేపట్టినట్లు వినికిడి. లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆరా తీశారని, లేఖలో ప్రస్తావించిన అంశాలపై కూడా ప్రత్యేకంగా పేర్కొన్నట్లు టాక్. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంగా కొట్టి పారేశారు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్.