ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ప్రొఫెసర్ అలీఖాన్‌కు బెయిల్ మంజూరైంది. హర్యానాలోని అశోక యూనివర్సిటీలో తను ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలు ఎందుకంటూ అలీఖాన్‌ను మందలించింది కోర్టు. తనకు బెయిల్ మంజూరు చేసి విచారణ నిలిపి వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన క్లయింట్ పోస్టులో నేరపూరిత ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయని వాదించారు న్యాయవాది కపిల్ సిబల్.