సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు జనం ఇబ్బందులు పడుతుంటే అందాల పోటీలు నిర్వహించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మంత్రులు అందాల భామల వెంట సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.