యూకో బ్యాంక్ స్కాం మాజీ సీఎండీ అరెస్ట్
NEWS May 20,2025 09:01 am
కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్ ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. తను సీఎండీగా కోల్ కతా కేంద్రంగా పని చేస్తున్న సమయంలో కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (సీఎస్‌పీఎల్) కంపెనీకి భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేశారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేసింది. మంజూరైన రుణాల్లో రూ. 6,210 కోట్లు సదరు కంపెనీ దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదైంది.