జూన్ 11 వరకు బడులకు సెలవులు
NEWS May 19,2025 11:40 am
తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని వెల్లడించింది. అయితే జూన్ 7వ తేదీ నుంచి టీచర్లు, హెడ్ మాస్టర్లు, మహిళా సంఘాలు, పాఠశాల కమిటీ సభ్యులు కలిసి పెద్ద ఎత్తున బడి బాట కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొంది. బడికి రాకుండా ఉన్న వారిని, బడి మానేసిన వారిని, కూలీ పనులలో ఉంటున్న వారిని గుర్తించి చదువుకునేలా , స్కూల్ కు వచ్చేలా చేయాలని పేర్కొంది.