శక్తి తుఫాన్ ఎఫెక్ట్ భారీ వర్షాలు
NEWS May 19,2025 06:46 am
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీకి శక్తి తుపాను ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో ఇది తుపానుగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 30-50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.