జగన్ లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారని, దీనికి ప్రతీకారంగా జగన్ రెడ్డిని ఒక్క రోజైనా చెరసాలలో ఉంచాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జగన్ అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసు నడుపుతున్నారంటూ మండిపడ్డారు. ఈ కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ కేసుతో జగన్ కు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు.