గ్రీస్‌లో భారీ భూకంపం
NEWS May 14,2025 11:11 am
గ్రీస్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. గ్రీస్ తో పాటు సమీప దేశాలైన కైరో, ఈజిప్ట్ ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది.