కేటీఆర్ కి పార్టీ పగ్గాలు ఇస్తే ఓకే
NEWS May 13,2025 05:20 pm
మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తమ నాయకుడని అన్నారు. అయితే ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగిస్తే తాను వ్యతిరేకించనని, స్వాగతిస్తానని చెప్పారు. కేసీఆర్ ఏది చెబితే అది చేసేందుకు తాను సిద్దంగా ఉంటానని అన్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నాడంటూ సెటైర్ వేశారు.