కోహ్లీ నిష్క్రమణపై కామెంట్స్
NEWS May 13,2025 09:38 am
భారత దేశ క్రికెట్ లో టాప్ క్లాస్ ప్లేయర్ గా పేరు పొందాడు విరాట్ కోహ్లీ. కానీ అనుకోకుండా తాను టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అందరినీ, ప్రత్యేకించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లను, మాజీ క్రికెటర్లను, ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది ఎవరూ ఊహించలేదు. తనకు ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ ఎందుకని తప్పుకోవాలని కోరుకున్నాడో తెలియడం లేదు. కోహ్లీ తప్పుకోవడంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.