తమిళ హీరో విశాల్ కు అస్వస్థత
NEWS May 12,2025 07:03 am
తమిళ సినీ హీరో విశాల్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విల్లుపురంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదిక మీద మాట్లాడుతుండగానే స్పృహ తప్పి పడి పోయారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ నటుడు కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. గత కొంత కాలంగా విశాల్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.