విశాఖ తరహాలో పాయకరావుపేట అభివృద్ది
NEWS Apr 12,2025 09:45 am
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న పదేళ్లలో పాయకరావుపేట నియోజకవర్గం విశాఖ, గాజువాక తరహాలో అభివృద్ధి కానుందన్నారు. నియోజకవర్గంలో బల్క్ డ్రగ్, స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని చెప్పారు. బల్క్ డ్రగ్ పూర్తయితే 11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు 15 వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు.