డీఎంకే మంత్రి పొన్ముడికి సీఎం షాక్
NEWS Apr 11,2025 01:56 pm
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన కేబినెట్ లో కీలక మంత్రి పదవి నిర్వహిస్తున్న కె. పొన్ముడికి షాక్ ఇచ్చారు. శైవ వైష్ణవ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి మనోభావాలు గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. దీంతో కె. పొన్ముడిని డీఎంకే కీలక పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. ఆయన తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయాలలో కలకలం రేపింది.