భారతిపై కామెంట్స్ ..టీడీపీ కార్యకర్త అరెస్ట్
NEWS Apr 10,2025 03:04 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీనిపై సీరియస్ అయ్యింది టీడీపీ అధిష్టానం. పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళల పట్ల చులకన చేసి ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉండగా చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేశారు మంగళగిరి పోలీసులు.