27న ఛలో వరంగల్ - ఎమ్మెల్యే
NEWS Apr 10,2025 02:55 pm
ఈనెల 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగే రజోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. గురువారం మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామం కె.ఎన్.రెడ్డి గార్డెన్లో జరిగిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా చీఫ్ కల్వకుంట్ల విద్యా సాగర్ రావుతో పాటు సీనియర్ నాయకులు, ముఖ్యులు హాజరయ్యారు.