ఖాకీల బట్టలు ఊడదీసి జగన్ ఏం చేస్తాడు..?
NEWS Apr 10,2025 02:47 pm
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. పోలీసుల బట్డలు ఊడదీసి జగన్ ఏం చూడాలి అనుకుంటున్నాడని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఆయనకు చప్రాసీలాగా పని చేశారని మండిపడ్డారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. గతంలో జగన్ పోలీసులను వాడుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా బాబును అరెస్ట్ చేయించ లేదా అని ఫైర్ అయ్యారు. అధికారులు కూడా ట్రాన్స్ఫర్ లకు భయపడి రాజకీయ నాయకులు చెప్పినట్లు చేయ కూడదన్నారు నారాయణ.