తెలంగాణలో మద్యం సరఫరాకు 604 బ్రాండ్లు
NEWS Apr 10,2025 09:56 am
తెలంగాణ ఆబ్కారీ శాఖ కీలక ప్రకటన చేసింది. మద్యం సరఫరా చేసేందుకు 604 కొత్త మద్యం బ్రాండ్లు వచ్చినట్లు తెలిపింది. ఇందులో 331 స్వదేశీ లిక్కర్ బ్రాండ్లు కాగా 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. 47 కొత్త కంపెనీల నుంచి 386 కొత్త మద్యం బ్రాండ్ల కోసం అప్లికేషన్లు వచ్చాయని, 45 పాత కంపెనీల నుంచి 218 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టం చేసింది. ఆయా మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపింది. గత ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్ 2 వరకు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చామని పేర్కొంది.