బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
NEWS Apr 10,2025 08:14 am
ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. టోర్నీలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లపై ఉంది. విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ షో చేస్తోంది. ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఆటగాళ్లు ఆడనున్నారు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో సైతం సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు మెగా టోర్నీలో 23 మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీగ్ మ్యాచ్ లలో భాగంగా ఇది 24వ మ్యాచ్ కావడం విశేషం. హోం గ్రౌండ్ కావడంతో ఆర్సీబీకే గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.