కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు
NEWS Apr 09,2025 04:56 pm
నటుడు మంచు మోహన్ బాబు కు బిగ్ షాక్ తగిలింది. జలపల్లి లోని ఇంటి వివాదం పై గతంలో కోర్టుకు వెళ్లారు. గతంలో తనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా కోర్ట్ ను తప్పుదోవ పట్టించారంటూ మంచు మనోజ్ లాయర్ ఆధారాలు సమర్పించారు. దీంతో ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది కోర్టు. తప్పిదానికి పాల్పడిన కోర్టు క్లర్క్ కు మెమో జారీ చేసింది .